Home తాజా వార్తలు ‘కెసిఆర్ మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు’

‘కెసిఆర్ మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు’

KTRఖమ్మం: మంత్రి కెటిఆర్ మంగళవారం ఖమ్మంలో రోడ్‌షో నిర్వహించారు. ఖమ్మం టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌కు మద్దతుగా కెటిఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కెటిఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్… రాష్ట్రంలో అన్నీ వర్గాల సంక్షేమం కోసం టిఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని.. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఫించన్లు, నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడన్నారు. కెసిఆర్ మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 43 పైసలు సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యానికి కూడా కోత పెట్టిందని మంత్రి మండిపడ్డారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తున్నామని, అలాగే ఇంటి స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు.