Home తాజా వార్తలు మార్చి 9న చేవెళ్ల‌లో కెటిఆర్‌ సభ..

మార్చి 9న చేవెళ్ల‌లో కెటిఆర్‌ సభ..

TRS Meeting

 

రంగారెడ్డి: మార్చి 9వ తేదీన చేవెళ్ల‌లో జరిగే సభకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హజరావుతారు. కావున సభను విజయవంతంగా జరిపించాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో ఆదివారం జరిగిన టిఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల‌లో జరిగే సభలో కెటిఆర్‌ పాల్గొంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కెసిఆర్‌ గారికి బహుమతిగా ఇవ్వాలన్నారు.

పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కెసిఆర్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు డిపాజిట్‌ వచ్చే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంఎల్ఎలు కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, మెతుకు ఆనంద్‌, మహేష్‌రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KTR Sabha in Chevella on March 9