Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సులో ‘కృష్ణార్జున యుద్ధం’ పైరసీ.. కెటిఆర్ ఫైర్

KTR Serious on TSRTC Staff who Encourage to play Piracy of Krishnarjunayudham Movie in Bus

హైదరాబాద్: పైరసీ భూతం సినీ ఇండస్ట్రీని పీడిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన తొలి రోజే పైరసీ రూపంలో బయటకు వచ్చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న, కఠిన చర్యలు అమలు చేస్తున్న పైరసీ రాకాసిని మాత్రం అధికారులు ఆపలేకపోతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీ విడుదలైన రెండో రోజే పైరసీని టిఎస్‌ఆర్‌టిసికి చెందిన గరుడ బస్సులో ప్రదర్శించడంపై మంత్రి కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. ఓ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో గరుడ సర్వీసులో ఈ మూవీని ప్రదర్శించారని కెటిఆర్‌ను ట్యాగ్ చేస్తూ చిత్రం స్క్రీన్ షాట్‌ను జోడించి ట్వీట్ చేశాడు. మూవీ విడుదలైన రెండో రోజే పైరసీని ప్రభుత్వ బస్సులో ప్రదర్శించడం ఏంటని యువకుడు ప్రశ్నించాడు. ప్రభుత్వ సంస్థలోనే పైరసీలను ప్రోత్సహిస్తూ సామాన్యులను పైరసీ నియంత్రించాలని ఎలా చెబుతారని యువకుడు నిలదీశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన కెటిఆర్… టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు చేసిన పని బాధ్యతారాహిత్యమని, సంస్థలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

comments