Home జోగులాంబ గద్వాల్ రాజకీయ సన్యాసం

రాజకీయ సన్యాసం

ktr

మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం

గద్వాల: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధి కారంలోకి రాకపోతే తాను శాశ్వతంగా రాజకీయ సన్యా సం తీసుకుంటానని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాల్‌కు సిద్ధ మా..? అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారాక రామా రావు సవాల్ విసిరారు. బుధవారం తొలిసారి మంత్రి కెటి ఆర్ జోగుళాంబ గద్వాల జిల్లాకు వచ్చారు. ఈ సందర్భం గా గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. శాసనసభ ఎన్నికలకు ఇంకా 20 నెలలు సమయం ఉందని, పౌరుషం కలిగిన నడిగడ్డ గద్వాల నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలు పెడుతున్నట్లు చె ప్పారు. ఇక్కడి నుంచి మొదలైన టిఆర్‌ఎస్ పార్టీ జైత్రయా త్ర తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. గడిచిన 50ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమి లేదని ముఖ్యంగా ఇక్కడి నిధులు, నీళ్లను దోచుకెల్లి ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని నిప్పులు చెరిగారు. 50ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతం అన్ని రం గాల్లో వెనకకు నెట్టివేయబడిందని దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నేతలే అని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఫ్లోరైడ్ బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పాపం కూ డా కాంగ్రెస్ పార్టీ నేతలదే అని ఆరోపణలు గుప్పించారు. నాటి ప్రధామంత్రి నెహ్రూమొదలుకుని ఇంధిరాగాంధీ, తరువాత సోనియా, రాహుల్‌గాంధీ వరకు తెలంగాణకు మోసం చేసినవాళ్లేనంటూ విమర్శలు గుప్పించారు. ‘కాం గ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తంకుమార్‌రెడ్డి అధికారంలోకి రావాలని గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నాడు. గడ్డాలు పెంచితే అధికారంలోకి వస్తారా? అందరూ గబ్బర్‌సిం గ్ లు అయిపోతారా?’ గతంలో తాను హైదారాబాద్ బల్ది యా, ఖమ్మం పాల్వంచలో జరిగిన ఎన్నికల్లో సవాల్ చేస్తే ఇదే ఉత్తంకుమార్‌రెడ్డి తన సవాల్‌ను స్వీకరించేందుకు బె దిరి పారిపోయడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. కార్య క్రమంలో మంత్రులు జూపల్లికృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ని రంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.