Home తాజా వార్తలు ‘ఆర్ఆర్ఆర్’కు కెటిఆర్ పెట్టిన టైటిల్ …

‘ఆర్ఆర్ఆర్’కు కెటిఆర్ పెట్టిన టైటిల్ …

KTRహైదరాబాద్ :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు మంచి  టైటిల్ ను చెప్పాలని  సినిమా యూనిట్ ఇటీవల అభిమానులను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు వినూత్నమైన టైటిల్ ను పెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’కు ‘రీజనల్ రింగ్ రోడ్’ అని టైటిల్ పెడుతానని  తనదైన శైలిలో కెటిఆర్ స్పందించారు. అయితే కెటిఆర్ పెట్టిన టైటిల్ ను రాజమౌళి ఆమోదిస్తారో లేదా వేచి చూడాలన్న అభిప్రాయాన్ని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గాయపడినట్టు వార్తలు వచ్చాయి. వారికి నయమయ్యాక తిరిగి షూటింగ్ చేస్తారట. 

KTR Tweet A Shocking Title To RRR