Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అఖిలేష్ కు స్వాగతం పలికిన కెటిఆర్

KTR-and-Akhilesh-yadav

హైదరాబాద్: బేగంపేట ఎయిర్ పోర్టుకు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు. అఖిలేష్ కు మంత్రి కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో అఖిలేష్ భేటీ కానున్నారు.  వారిరువురు ప్రత్యేకంగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తారు.  తాజాగా యుపిలో జరిగిన రెండు లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ బిఎస్‌పి మద్దతుతో ఎస్‌పి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.  ఈ  నేపథ్యంలో సిఎం కెసిఆర్‌తో అఖిల్‌శ్ యాదవ్ భేటీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలేశ్‌తో మంత్రి కె.టి.రామారావుకు సన్నిహిత సంబంధాల ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments