Home తాజా వార్తలు చిన్నారిని ఆదుకున్న కెటిఆర్…

చిన్నారిని ఆదుకున్న కెటిఆర్…

KTR

 

ట్విట్టర్‌లో విన్నపానికి స్పందించి సిఎం నిధి నుంచి 2.5లక్షల సాయం
పెద్దపేగు సర్జరీ విజయవంతం, క్షేమంగా ఇంటికి చేరిన బాబు
కృతజ్ఞతలు తెలిపిన తలిదండ్రులు

హైదరాబాద్: కెటిఆర్ సకాలంలో స్పందించడంతో ఓ చిన్నారి వైద్యానికి నిధులు అందాయి. పాప వైద్యానికి అయ్యే ఆస్పత్రి ఖ ర్చులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించడంతో వారు వెంటనే స్పందించారు. బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి చేరడానికి సిఎం సహాయనిధి నుంచి రెండున్నర లక్షల రూ పాయలను నిధులను అధికారులు వి డుదల చేశారు. జగిత్యాల జిల్లా రంగారావు పేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మధు, సుమీత రాణి దంపతులు మే 8న మెట్‌పల్లిలో మగబిడ్డకు జన్మనిచ్చారు, డెలివరీ అన ంతరం ఆ బిడ్డను పరిశీలించిన స్థానిక డాక్టర్లు శిశువు పెద్దపేగు మూ సుకుపోయి ఉందని, ఆపరేషన్ ద్వారా రం ధ్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బిడ్డను డాక్టర్లు పరిక్షించిన అనంతరం బాబు ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఏం చే యాలో అర్థంకాని మధు దంపతులు సోషల్ మీడియాలో తమకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దంపతులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ది నెస్ట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్,హైదర్‌నగర్ సభ్యులు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ ఉద్యోగులతో పాటు సురేందర్ ఫౌండేషన్ మెట్‌పల్లిల వారు అందించిన విరాళాల ద్వారా ఒక లక్ష 50 రూపాయలను సేకరించారు.

మరి కొంతమొత్తం తక్కువ కావడంతో ఆర్థిక సాయం కోసం టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ కార్యాలయాన్ని డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ద్వారా సంప్రదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కెటిఆర్ మిగిలిన మొత్తానిన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఖర్చులు కింద భరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయం వెంటనే రెండున్నర లక్షలు విడుదల చేసి చిన్న బాబు సర్జరీ విజయవంతం అయ్యేలా కృషి చేసింది. తమ బిడ్డ ప్రాణాలు కాపాడి ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్లామని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమని ఆ పాప తల్లిదండ్రులు పేర్కొన్నారు. తాము చేసిన విజ్ఞప్తికి కెటిఆర్ స్పందించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

KTR who Saved Baby Survivor