Home తాజా వార్తలు జగన్‌కు శుభాకాంక్షలు: కెటిఆర్

జగన్‌కు శుభాకాంక్షలు: కెటిఆర్

KTR, Jagan

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి భారీ విజయం ఖాయం కావడంతో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జగన్ పడిన కష్టానికి ప్రజలు ఆశీర్వదించారన్నారు. తెలంగాణకు సొదరిలాంటి ఎపిని మీరు మంచిగా పాలించాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 145 స్థానాల్లో ముందంజలో ఉండటమేగాక మూడు స్థానాలు గెలిచింది. టిడిపి 26 ఆధిక్యంలో ఉంది. జగన్‌కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఎపి లోక్ సభ ఎన్నికలలో వైసిపి 24 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా టిడిపి ఒక స్థానంలో ముందంజలో ఉంది.

 

KTR Wishes to YS Jagan Mohan Reddy in AP Elections