Home కెరీర్ కెయు పిహెచ్‌డి, ఎంఫిల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

కెయు పిహెచ్‌డి, ఎంఫిల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Kakatiya University

హన్మకొండ: కాకతీయ యూనివర్శిటీ 2015-16, 2016-17 విద్యా సంవత్సరాలకు గాను పిహెచ్‌డి, ఎంఫిల్ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 అపరాధ రుసుముతో మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: పిహెచ్‌డికి రూ. 1000(ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు రూ. 750), ఎంఫిల్‌కు రూ. 700(ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు రూ. 500).
ప్రవేశ పరీక్ష తేదీలు: మార్చి 25న పిహెచ్‌డి, మార్చి 24న ఎంఫిల్ ప్రవేశ పరీక్ష ఉండనుంది.
విద్యార్హతలు: ఎంఫిల్, పిహెచ్‌డి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉండాలి.
పూర్తి వివరాలకోసం www.kakatiya.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు వెల్లడించారు.