Home తాజా వార్తలు కెయు పిజి సెట్-2018 ఫలితాల విడుదల

కెయు పిజి సెట్-2018 ఫలితాల విడుదల

kakatiya university convocation day conducted on july 11

వరంగల్: కెయు పిజి సెట్ – 2018 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం మే 29 నుంచి జూన్ 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ ఫలితాలను విసి ప్రొ. ఆర్. సాయన్న, రిజిస్ట్రార్ ప్రొ. కె. పురుషోత్తలు విడుదల చేశారు. 28 కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిపిన కెయు పిజి సెట్-2018 ప్రవేశ పరీక్షకు 28, 354 మంది దరఖాస్తులు చేసుకోగా, ప్రవేశ పరీక్షలకు 24,723 మంది హాజరయ్యారు. 21,487 మంది (88.5 శాతం) పరీక్షలో అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు.

28 నుంచి సర్టిఫికెట్ట పరీశీలన…

పిజి సెట్ ద్వారా కెయు, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పిజి కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 28వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలను చేపట్టనున్నట్టు కెయు అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొ.కె.మనోహర్, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ టి రాజకొమురయ్య, డాక్టర్ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన కొరకు కెయులో 2 కేంద్రాలు కామర్స్ బిజినెస్ కళాశాల, హ్యుమనిటీస్ విభాగంలో, కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీలో, ఖమ్మంలో పిజి సెంటర్లలో అన్ని సబ్జెక్టులకు సర్టిఫికెట్ల పరిశీలను చేపట్టనున్నట్టు అధికారలు పేర్కొన్నారు.