Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కుల్దీప్ ట్రిపుల్‌ ధమాకా…

Kuldeep-yadav

నాటింగ్‌హమ్: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని బౌలింగ్ శైలిని అర్థం చేసుకోలేని ఇంగ్లాడ్ బ్యాట్స్‌మెన్లు తమ వికెట్లను సమర్పించుకుంటున్నారు. 10 ఓవర్లులో ఓపెనర్లు జాసన్ రాయ్(38), బెయిర్‌స్టో(38) నిలకడగా ఆడుతూ 71 పరుగులు చేశారు. ఈ క్రమంలో స్పిన్ మాంత్రికుడు కుల్దీప్‌కు  భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుల్దీప్ కి బంతినిచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని అతడు మరోసారి నిలబెట్టుకున్నాడు. అంతేకాదు భారత్ మ్యాచ్‌పై పట్టుసాధించేలా చేశాడు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికే జాసన్ రాయ్‌ను పెవిలియన్ పంపించి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 13వ ఓవర్ మొదటి బంతికే జో రూట్‌(3)ను ఎల్ బిగా ఔట్ తన సత్తా చాటుకున్నాడు. అదే ఓవర్ లోని 5 బంతికి దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టోను కూడా ఎల్ బిగా ఔట్ చేసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుల్దీప్ కుప్పకూల్చాడు. తన తొలి రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు.

Comments

comments