Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

సోనియా, రాహుల్‌తో కుమారస్వామి భేటీ

Kumaraswani

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలతో జెడిఎస్ అధినేత హెచ్.డి. కుమారస్వామి భేటీ అయ్యారు. రాహుల్, సోనియాలకు పుష్పగుచ్ఛాలను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అలాగే 23వ తేదీన బెంగళూరులో జరిగే తన ప్రమాణ స్వీకారానికి ఇద్దరిని ఆహ్వానించారు. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై ఉన్న గౌరవం, అభిమానం తెలిపేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. సోనియా, రాహుల్‌లు తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించారని ఆయన తెలిపారు. కాగా, ఈ భేటీలో ఇరుపార్టీల కూటమికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Comments

comments