Home జాతీయ వార్తలు అప్పుడు ఆయన చేయలేదు.. ఇప్పుడు నేను చేయను

అప్పుడు ఆయన చేయలేదు.. ఇప్పుడు నేను చేయను

Kumaraswamy

 

బెంగళూరు: కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి సిఎం పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, బుధవారం రాత్రి నుంచి ఆయన తన తండ్రి, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో చర్చలు జరపడంతో అదే సూచించారని, రెబల్ ఎంఎల్ఎలు దారికొచ్చే పరిస్థితి కనిపించకపోవడం, మరో ఇద్దరు ఎంఎల్ఎలు కూడా రాజీనామా చేయడంతో కేబినెట్‌ భేటీలో కుమారస్వామి అదే నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై కుమారస్వామి కాస్త ఘాటుగా స్పందించారు. ‘2010లో యడ్యూరప్ప సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభం తలెత్తిందని,  అప్పుడు ఆయన రాజీనామా చేశారా? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇప్పుడు తను కూడా రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేబినెట్ భేటీ అనంతరం కుమారస్వామి గవర్నర్‌ వాజుభాయ్ వాలాతో భేటీ కానున్నట్లు సమాచారం. గవర్నర్ తో  భేటీ అనంతరం కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనన్న అంశం కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Kumaraswamy response on news of resignation of CM post