Home కుమ్రం భీం ఆసిఫాబాద్ గిరిజన సంప్రదాయాలతో కుమ్రం భీం

గిరిజన సంప్రదాయాలతో కుమ్రం భీం

నూతన కలెక్టర్‌గా చంపాలాల్, ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్

Adilabad-SPఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కొమురంభీం(ఆసిఫాబాద్) జిల్లా వేడుకలను అంగరంగవైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా కేం ద్రానికి చేరుకోగానే ఆదివాసీ, గిరిజనులు నృత్యాలు చేస్తు గుస్సాడీల వేశాధారణలతో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కోనేరు కోన ప్పలు మంత్రికి స్వాగతం పలికారు. జన్కాపూర్ రామాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు గిరిజనుల నృత్యాలతో మంత్రి కలెక్టరేట్ కార్యాలయంకు చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మంత్రి రామ న్న ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం కలె క్టరేట్ కార్యాలయాన్ని నూతన కలెక్టర్ చంపాలాల్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కోనేరు కోనప్పలతో కలిసి వేద పండితుల పూజల తో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం 11.15 గంట లకు నూతన కలెక్టర్ చందులాల్ ఫైల్ పై సంతకం చేసి బాధ్య తలు స్వీకరించారు. నూతన కలెక్టర్‌కు మంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం కలెక్టర్‌తో కలిసి కార్యాలయంలోని ఆయా శాఖ గదులను పరిశీలించారు. అలాగే అదే కార్యాలయంలోని పలు జిల్లా శాఖలను ఆయా శాఖకు సంబందించిన జిల్లా అధికారులు ఆయా శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. అక్కడి నుండి మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే కొత్త ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వేద పండితుల పూజలతో నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి తో కలిసి కార్యాలయం లోని ఎస్పీ గదిని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ఆవరణలో పరేడ్ గ్రౌడ్‌కు చేరుకుని జాతీయ జెండాను ఎగరవేసి ఎస్పీ తో, కలెక్టర్ లకు పోలీసులు పరేడ్ నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చిన్న జిల్లాలతోనే పరిపాలన సౌలభ్యంగా జరుగుతుందని, రాష్ట్రంలో ప్రతి ఒక పేద గిరిజన ఆదివాసీలకు ప్రభుత్వం అంది స్తున్న పథకాలు చేరేందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న జిల్లాతోనే అభివృద్ది జరుగుతుందని గ్రామాలు, మండలాలు అభివృద్ది చెందినప్పుడు బంగారు తెలంగాణ సాద్యమవుతుందన్నారు. అనంతరం కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను ప్రతి ఒక్క లబ్దిదారునికి అందేలా చర్యలు తీసకుంటామన్నారు. రెండుమూడు రోజుల్లో జిల్లా అంతటా తిరిగి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్దికి సహకరిస్తామన్నారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి అశోక్ మాట్లా డుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన ఆదివాసి బిడ్డా కొమురంభీం పేరు ఆసిఫాబాద్‌కు పెట్టుడం ఎంతో సంతోషకరం అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధు లు కలిసి జిల్లా ను అభివృద్ది బాటలో నడిపించాలన్నారు. అభివృద్దిలో రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా ఆదివాసి జిల్లా అయిన కొమురంభీం ఉండాలన్నారు.ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, జయింట్ కలెక్టర్ అశోక్, డిఆర్‌డిఎ అద్వైత్‌కుమార్ సింగ్, జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపిపి తారాభాయ్, మార్కెట్ కమిటి చైర్మ న్ గంధం శ్రీనివాస్, ఆయా శాఖ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.