Home Default ఆరోగ్యం, ఆత్మరక్షణకు కుంగ్‌ఫూ ఎంతో దోహదం…

ఆరోగ్యం, ఆత్మరక్షణకు కుంగ్‌ఫూ ఎంతో దోహదం…

Kungfu contributes to health and self-defense

చౌటుప్పల్ : విద్యార్థుల ఆరోగ్యం, ఆత్మరక్షణకు టైగర్స్ కుంగ్‌ఫూ ఎంతో దోహద పడుతుందని టైగర్స్ కుంగ్‌ఫూ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పైలాన్ పార్కు ఆవరణలో శనివారం కుంగ్‌ఫూ జిల్లా స్థాయి బెల్టు టెస్టు పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీలకు జిల్లాలోని పలు మండలాల నుంచి సుమారు 100 మందికి పైగా విద్యార్ధినీ విద్యార్దులు హాజరైనట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్‌ను తప్పకుండా నేర్చు కోవాలన్నారు. దీంతో శారీరక దృఢత్వం, ఆరోగ్యం, ఆత్మరక్షణ, క్రమశిక్షణ, సూక్ష్మబుద్ది వంటి ఎన్నో లాభాలున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు అత్యవసర సమయంలో ఆకతాయిల బారినుంచి కాపాడుకునేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్దినీ విద్యార్దులకు శ్రీనివాస్ చేతుల మీదుగా బెల్టులు, సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ రాజశేఖర్, విద్యార్దులు పాల్గొన్నారు.

 

Kungfu contributes to health and self-defense …