Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జివిఎల్ ది డొంక తిరుగుడు సమాధానం…

kutumba-rao

అమరావతి: వైజాగ్-చెన్నై కారిడార్‌తో ఎన్ని ఉద్యోగాలొస్తాయో తమకు తెలీదా? అని కుటుంబరావు అడిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రంగాల్లో తనకున్న అనుభవం దృష్ట్యా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అర్హత, యోగ్యతలను బట్టే నేతలకు పదవులు దక్కుతాయని వివరించారు. అగ్రిగోల్డ్ అంశంపై విపక్షనేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎపి ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టుకీడ్చండన్నారు.  తాను చేసిన సవాల్‌కు జివిఎల్ డొంక తిరుగుడు సమాధానం చెబుతున్నాడని దుయ్యబట్టారు. బిజెపి ఎంపి జివిఎల్ నరసింహా రావు చెప్పినవన్ని అబద్దాలని తేలిపోవడంతో తాను అసహనంతో ఉన్నారన్నారు.

వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమని జివిఎల్‌పై మండిపడ్డారు. జివిఎల్ దగ్గర సబ్జెక్ట్ లేదన్నారు. అగ్రిగోల్డ్‌లో జరిగిన అక్రమాలను  ధ్రువీకరించేది అధికారులా?… రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కావొద్దని ప్రతిపక్షనేత, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని,  ప్రధాని నరేంద్ర మోడీపై వచ్చిన ఆరోపణల కేసులో తాజాగా ఆధారాలు లభించాయని, ఈ కేసును ప్రశాంత్ భూషన్ వాదించబోతున్నారని పేర్కొన్నారు. 2జి స్కామ్ కేసును నిర్వీర్యం చేసింది బిజెపి ప్రభుత్వం కాదా అని కుబుంబరావు నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంపై జివిఎల్ అవినీతి ఆరోపణలు   చేసిన విషయం తెలిసిందే.

Comments

comments