Home తాజా వార్తలు లేబర్ కాంట్రాక్టర్ అదృశ్యం

లేబర్ కాంట్రాక్టర్ అదృశ్యం

Labor Contractor Missing in Hyderabad

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి లేబర్ కాంట్రాక్టర్ అదృశ్యం అయ్యాడు. అంబర్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో ఉండే వరికుప్పల కృష్ణ (45) జిహెచ్‌ఎంసిలో లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 11న లిబర్టీ వద్ద జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పారు. ఆపై ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కృష్ణ భార్య శారద కార్యాలయానికి వెళ్లి వాకబు చేసింది. ఆఫీసు వద్ద కృష్ణ స్కూటీ పార్క్ చేసి ఉంది. ఈ క్రమంలో కృష్ణ అదృశ్యంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణ తన వెంట రూ.8 లక్షలు తీసుకెళ్లాడని, రెండు నెలల క్రితం కూడా ఎవరికీ చెప్పకుండా పది రోజుల పాటు ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చాడని ఆయన భార్య శారద పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Labor Contractor Missing in Hyderabad