Home భద్రాద్రి కొత్తగూడెం గోదావరిలో లాంచి మునక

గోదావరిలో లాంచి మునక

Lachi drown in Godavari

పలువురు ప్రయాణికుల గల్లంతు
పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ఘటన
నాలుగు రోజుల వ్యవధిలోనే మరో సంఘటన

మన తెలంగాణ/భద్రాచలం : తూర్పుగోదావరి జిల్లాలోమరోసారి బోటు ప్రమా దం చోటు చేసుకుంది. దేవీపట్నం మం డలం మల్టూరు వద్ద గోదావరి నదిలో లాం చి మునిగిపోయింది. ఈ లాంచిలో సుమా రు 55 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్లు సమాచారం. వీరిలో కొందరు ఒడ్డు కు ఈదుకుంటూ రాగా మరి కొం దరు గల్లంతైనట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా (పూర్వపు ఖమ్మం జిల్లా)కు చెందిన కొన్నికుటుంబాల వారు తూర్పు గోదావరి జిల్లాలోని కొండమొదలు గ్రామానికి ఓ పెళ్లి వేడుక నిమిత్తం మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. వేడుక ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో దేవిపట్నం మండలంలో గల మంటూరు – ఓడపల్లి నదీ ప్రాంతానికి బోటు రాగానే పెద్ద ఎత్తున గాలి దుమారం రేగడంతో వారు ప్రయాణిస్తున్న పడవ సుడిగాలిలో చుక్కుకుని బోల్తా పడినట్లు తెలుస్తోంది. కాగా దీంతో ఒక్క సారిగా భయాందోళనకు గురైన గిరిజన ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఆర్థనాలు పెట్టినట్లు తెలుస్తోంది. సహజంగా గోదావరి పరివాహక ప్రాంతం వారు కాడంతో కొందరు మల్టూరు, మరికొందరు ఓడపల్లి, ఇంకొందరు ఇందుకూరు వైపుకు ఈదుకుంటు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా సుమారు 20 మంది గల్లతు అయినట్లు తెలుస్తోంది. ఏడుగురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చినట్లు తెలుస్తుంది. మిగిలిన వారంతా బోటులోనే ఉన్నట్లు తెలస్తుంది. బోటు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేయగా సమీపంలోని గిరిజనులు కొందరు నాటుపడవల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వెంకటేశ్వర లాంచీ నిర్వాహకుడు దేవిపట్నం పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే ప్రతికూల పరిస్థితు లు కారంణంగా గాలింపు చర్యలు తీవ్ర అంతరాయం ఏర్పడినటు తెలుస్తోంది.

నాలుగు రోజుల వ్యవధిలోనే మరో ఘటన : గత నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పాపికొండల విహారయాత్ర లాంఛీ నది మధ్యలో ఒక్క సారిగా బోల్తా కలిపోయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఏకంగా బోడు నీటిలో మునిగిపోయింది. లాంచీ కాలిపోయిన ఘటన తర్వాత వారం రోజుల పాటు అట్నుంచి పాపికొండల విహారయాత్ర లాంచీలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి రక్షణ చర్యలతో పాటు, అన్ని రకాల అనుమతులు ఉంటేనే గానీ విహారలాంచీలు తిప్పరాదనే నిబంధనలు పెట్టారు. కాగా అదే గ్రామానికి చెందిన వారు పెళ్లి వేడుకకు వెళ్లేందుకు ప్రత్యేక లాంచీని మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది.