Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అటకెక్కిన కంప్యూటర్ విద్య

Computers

బోధకులు లేకపోవడంతో మూలన చేరిన కంప్యూటర్‌లు
వచ్చే విద్యా సంవత్సరమైనా కంప్యూటర్ విద్యనందించాలని విద్యార్థుల విన్నపం
స్పందించని విద్యాశాఖాధికారులు

కౌటాల: విద్యార్థులను కంప్యూటర్ విద్యకు చేరువగా ఉంచనున్న లక్ష్యానికి విద్యాశాఖాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తరగతి గదిలో కంప్యూటర్‌లు ఉన్నా బోదకులకు ఉపయోగపడకపోవడంతో విద్యార్థులు అంత కంప్యూటర్‌ల విద్యకు దూరం అవుతున్నారు. కొన్ని ఏళ్ళుగా ఈ సమస్య ఉన్నా అధికారులు స్పందిచకపోవడంతో విద్యార్దులు ప్రైవేటు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళాల్సి పరిస్దితి ఉంది. మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాలపాఠశాల లోని కంప్యూటర్ విద్య నీరు గారిపోతుంది. కంప్యూటర్ విద్య వారికి అందిస్తామన్నా సఉద్దేశ్యంతో 2009లో ఎక్‌మ్ అనే సంస్ద కంప్యూటర్ ఆపరేటర్‌ను ఉచితంగా అందజేయడం కాకుండా వారే ఒక్క బోధనకు నియమించి ఆయన ద్వారా విద్యార్దులకు ప్రతిరోజు కంప్యూటర్ నిర్మించారు.

అయితే ఈ సంస్ద టీచర్లను కొనసాగించడం విరమించారు. దీంతో అప్పటి నుండి విద్యార్దులకు కంప్యూటర్ విద్యకు దూరమైయింది. ఏక్‌మ్ సంస్ద అందజేసిన కంప్యూటర్‌లు నాలుగు ఏళ్ళుగామూలన ఉన్న విద్యశాఖాధికా రులుస్పందించకపో వడం దారుణం. కంప్యూటర్ బోధకులను నియమించి విద్యార్థులకు  కంప్యూటర్ విద్యను అందించాలని అటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ల్యాబ్‌లు వృథాగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి విద్యార్దులకు కంప్యూటర్ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

comments