Home అంతర్జాతీయ వార్తలు పుల్వామా ఉగ్రదాడి వెనక ‘ఆమె’?

పుల్వామా ఉగ్రదాడి వెనక ‘ఆమె’?

Pulwama Terror Attackఢిల్లీ : ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో సుమారు 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అధికారుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి హనీ ట్రాప్‌లో  ఓ భారత జవాను చిక్కుకున్నారు. ఈ క్రమంలో సదరు జవాను  ఆమెకు భారత ఆర్మీ రహస్యాలను చేరవేశాడు. ఈ క్రమంలో ఆమె తనకు తెలిసిన భారత ఆర్మీ రహస్యాలను జైషే ఉగ్రవాదులకు ఇచ్చిందని, దీంతో ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో పుల్వామా దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ (25) నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడు అసోంకు బదిలీ అయ్యాడు.  అవినాశ్ కుమార్ తో ఓ పాకిస్థాన్ యువతితో వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుంది.  ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్ భారత ఆర్మీ రహస్యాలను చేరవేశాడు. ఆ రహస్యాలను ఆమె జైషే  ఉగ్రవాదులకు అందించేది. అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాక్ నుంచి రూ.50 వేలు జమ అయినట్టు అధికారులు గుర్తించారు. అవినాశ్‌కు భోపాల్ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది.

Lady Behind Pulwama Terror Attack