Home తాజా వార్తలు భారీ ధరకు ‘ఎన్టీఆర్’ ఆడియో రైట్స్

భారీ ధరకు ‘ఎన్టీఆర్’ ఆడియో రైట్స్

NTR Biopic

హైదరాబాద్: టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. అయితే నందమూరి అభిమానులందరి దృష్టి అంతా ఇప్పుడు ‘ఎన్ టిఆర్’ జీవిత చరిత్రపేనే ఉంది. ఈ సిన్మాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు క్రిష్ ఇప్పటికే చిత్రీకరించాడు. ఇటీవలే ఈ సినిమా కోసం హన్సిక, పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. వీరి ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై  మరింతగా ఆసక్తి పెరిగింది.

ఈ క్రమంలో ఈ చిత్ర ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడవడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆడియో రైట్స్ ను ”లహరి” సంస్థ 2 కోట్లకు కొనుగోలు చేసింది. నిజానికి ఆడియో అమ్మకాలు తగ్గిపోయి చాలా రోజులు అవుతోంది.  ఇటీవల ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లకు విడివిడిగా ఆడియో రైట్స్ విక్రయించడం ద్వారా లాభాలు అధికంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘లహరి’ సంస్థ ఈ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసిందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.

Lahari Music Buy NTR Biopic Audio Rights

telangana latest news