Home జిల్లాలు లక్షా 75వేల ఎకరాలకు సాగునీరు

లక్షా 75వేల ఎకరాలకు సాగునీరు

mbnr* నా కల సాకారమైంది * మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గంలో భీమా, కెఎల్‌ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా లక్షా 75వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగు తుందని పంచాయతీరాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలోని 58వ సర్వే నెంబర్‌లో రూ.3 కోట్ల నాబార్డు నిధుల నుండి నిర్మి స్తున్న గిడ్డంగి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం నుంచి చేసుకోలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెండేళ్లలోనే అభివృద్ది చేసుకోగలిగామన్నారు. రానున్న మూడేళ్లలో ఉహించని అభివృద్ధి కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. సీమాంధ్రుల పాలనలో శాఖపూర్ బిటి రోడ్డు కోసం రూ.2 కోట్ల నిధులు విడుదల చేసుకోలేక పోయామని, ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారి మాటలకు తెలంగాణ అభివృద్ధి ఇప్పటికైనా కనపడుతుందా అని ఆయన ప్రశ్నించారు. తాను మొదటిసారిగా 1999లో పోటీ చేసిన సందర్భంగా నియోజక వర్గంలోని ప్రతి గుంట, ప్రతి సెంటుకు కృష్ణాజలాలు అందించడమే లక్షమని నాడు హామీనివ్వడం జరిగిందన్నారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పనిచేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నా కల సాకరమైందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. నియోజక వర్గం ప్రజలు ఆనందంగా ఉంటేనే తాను ఆనందంగా ఉంటానన్నారు.
భీమా, కెఎల్‌ఐ కాల్వలను పరిశీలించిన మంత్రి జూపల్లి
మండలంలోని గ్రామాల మీదుగా వెళ్లిన భీమా, కెఎల్‌ఐ కాల్వలను సంబంధిత అధికారులతో కలిసి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. గత 15 రోజుల క్రితం తాను కాల్వలను సందర్శించిన సమయంలో పెండింగ్ పనులు పూర్తి చేసి కాల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించినప్పటికీ 15 రోజులు పూర్తయినా పనులు పెండింగ్‌లో ఉండటంపై సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి కేతేపల్లి రవి, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, తెరాస అధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, తిరుపతయ్యసాగర్, సురేందర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, కేతేపల్లి విష్ణు, లోకారెడ్డి, గోప్లాపూర్‌రాజుగౌడ్, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.