Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గహిర్మాత బీచ్ లో లక్షల తాబేళ్లు మృతి..!

death

భువనేశ్వర్: బడిశాలో కొన్ని లక్షల అరుదైన ఆలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్లలు మృతిచెందాయి. ప్రతి సంవత్సరం గహిర్మాత బీచ్ ఒడ్డున లక్షల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పుడుతాయి. కొన్ని వేల మైళ్లు ప్రయాణించే తల్లి తాబేళ్లు ఇక్కడి బీచ్ లోనే గుడ్లు పెట్టి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అవి కాస్తా పొదిగి పిల్ల తాబేేళ్లు బయట వస్తాయి. అయితే ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అక్కడి బీచ్ లో ఇసుక అంతా గడ్డకట్టింది. దీంతో గుడ్లలో నుంచి  జీవం పొసుకునే తాబేలు పిల్లలు మృత్యవాత పడ్డాయి. ఈ ఏటా కోటి తాబేలు పిల్లలు జీవం పోసుకుంటాయని అధికారలు అంచనా వేసినట్టు తెలిపారు. రోజు రోజుకు ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చాలా అరుదైన జాతిగా మారుతున్నాయి. వేల సంఖ్యలో పుట్టిన ఈ తాబేళ్లు చివరకు ఒకటి, రెండు మాత్రమే పెరిగి సుదీర్ఘకాలం బ్రతుకుతున్నాయి. బీల్ లో తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టిన గుంతలను పరీశీలించగా చనిపోయిన పిల్ల తాబేళ్లు కనబడ్డాయి. బీచ్ లో ఇసుక గట్టిపడడం వల్ల అవి బయటకు రాలేకపోయాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బిమల్ ప్రసన్న ఆచార్య తెలిపారు. ఈ సారి తల్లి తాబేళ్లు కనీసం రెండు కోట్ల సంఖ్యలో గుడ్లు పెట్టాయి. అందులోంచి 6.67 లక్షల తాబేలు పిల్లలు మాత్రం బతికి బయటకు వచ్చాయి. ఒక్కో ఆలివ్ రిడ్లీ తాబేలు వంద నుంచి రెండు వందల గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పొదగడానికి 45 నుంచి 50 రోజులు సమయం పడుతుంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో గహిర్మాత బీచ్ శ్మశానంగా మారిందని బిమల్ ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments