Home తాజా వార్తలు ఆసియా క్రీడలు: భారత్ ఖాతాలో మరో రజతం

ఆసియా క్రీడలు: భారత్ ఖాతాలో మరో రజతం

Lakshay Sheoran Wins Silver In Asian Games 2018

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు  పతకాల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా భారత షూటర్ లక్షయ్ షెరాన్ రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల షూటింగ్ ట్రాప్ విభాగంలో భాగంగా మెన్స్ ట్రాప్ ఫైనల్లో 48 టార్గెట్‌లకు గాను లక్షయ్ మొత్తం 42 టార్గెట్లను ఫినిష్ చేశాడు. ఆదివారం ప్రారంభమైన ఈ పోటీల్లో భారత్‌కు ఇప్పటి వరకు మొత్తం నాలుగు (పసిడి, 2 రజత, కాంస్యం) పతకాలు దక్కాయి. తొలి రోజు పురుషుల 65కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో భజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించగా, 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అపూర్వీ చండేలా, రవికుమార్ ద్వయం కాంస్య పతకం,  షూటర్ దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.