Home తాజా వార్తలు తప్పుడు ఆరోపణలపై డిజిపి కి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి

తప్పుడు ఆరోపణలపై డిజిపి కి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి

Lakshmi-Parvati

హైదరాబాద్: తన పై సోషియల్ మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ డిజిపి మహేందర్ రెడ్డికి  వైసిపి నేత లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేశారు. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడని, గౌరప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను అగౌర పరుస్తూ విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఏప్రిల్ 4 తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానెల్స్, సోషియల్ మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. కోటి అనే యువకుడు పై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ పార్వతి డీజీపీ కి  ఫిర్యాదు చేశారు. కోటి తో ప్రసారం చేసిన మీడియా ఛానల్ , యాంకర్ పై చర్యలు తీసుకోవాలని, తన పై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తి ని బిడ్డలగా భావించానని ఆమె అన్నారు.

Lakshmi Parvati complaint to DGP On Koti