Home తాజా వార్తలు వాడు… నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు…

వాడు… నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు…

Lakshmi‘s NTRహైదరాబాద్ : ఎన్‌టిఆర్, లక్ష్మీపార్వతి జీవిత కథల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్‘. లక్ష్మీ పార్వతి దృష్టి కోణంలో ఈ సినిమా రూపుదిద్దకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ వేగవంతం చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. తాజాగా శుక్రవారం మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ’వాడు, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు‘ అన్న క్యాప్షన్ తో ట్రైలర్ మొదలైంది. లక్ష్మీపార్వతిని ఎన్ టిఆర్ కుటుంబ సభ్యులు అవమానించడం, దూషించడం, పార్టీని తమ చేతిలోకి లాక్కోనేందుకు ప్రణాళికలు వేయడం వంటి అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. మే 22న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారుడు విజయ్ కుమార్ ఎన్ టిఆర్ పాత్రలో నటిస్తుండగా, యజ్ఞాశెట్టి  లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. ఎన్ టిఆర్ కు కుటుంబంలో జరిగిన ద్రోహాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. దీంతో ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Lakshmi‘s NTR Second Trailer Release