Home వార్తలు లక్ష్మీరతన్ రిటైర్మెంట్

లక్ష్మీరతన్ రిటైర్మెంట్

Untitled-1.jpg111కోల్‌కతా : భారత మాజీ ఆల్‌రౌండర్, బెంగాల్ దేశవాళీ ఆటగాడు లక్ష్మీరతన్ శుక్లా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరుపున మూడు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన శుక్లా బుధవారం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టుకు ఆడిన మూడు వన్డేల్లోనూ 18 పరుగులే చేసిన శుక్లా 137 ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 6217 పరుగులు, 172 వికెట్లు సాధించాడు. 2011-12 సీజన్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లాలా అమర్‌నాథ్ అవార్డును అందుకున్న 34 ఏళ్ల లక్ష్మీరతన్ బెంగాల్ తరుపున 100 రంజీ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు.