Search
Saturday 22 September 2018
  • :
  • :

లడాయి

Lambada employees will be blocked

మా ఊర్లో మా పాలన : ఆదివాసీలు
లంబాడా ఉద్యోగులను అడ్డుకుంటాం

ఆదివాసీల లడాయి మళ్లీ మొదలైంది. ఎస్టిలలో రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెద్ద రగడగా మారుతుంది. ఎస్టి జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన ఆదివాసీలు నేటి నుంచి మా ఊర్లో మా పాలన అంటూ మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎస్టిజాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను లంబాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగింపు సహించేది లేదంటున్నారు. కొనసాగాలన్న డిమాండ్‌తో పలు ఆందోళనలు చేపట్టారు. ఆదివాసీలు, లంబాడీలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. 

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : గిరిజన జనాభా అధికంగా కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనుల మధ్య రిజర్వేషన్ చిచ్చు మొదలైంది. అడపా దడపా ప్రకటనలకే పరిమితమైన ఆదివాసీలు ఎస్టిల నుంచి లంబాడీలను తొలగించాలని ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. జూన్ ఒకటి నుంచి మా ఊర్లో మా పాలన అంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు నియోజక వర్గాల్లో లంబాడీ జనాభా అధికంగా ఉండగా మిలిగిన భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజక వర్గాల్లో ఆదివాసీలు అత్యథికంగా ఉన్నారు. ఖమ్మంజిల్లాలో ఆదివాసీలు రెండు, మూడు మండలాల్లో మాత్రమే ఉండగా లంబాడీలు దాదాపు అన్ని మండ లాల్లో ఉన్నారు. కొన్ని మండలాల్లో లంబాడీ జనాభానే ఎక్కువ. ఆదివాసీలు, లంబాడీ ఉద్యోగులను గ్రామంలోకి రానివ్వమని ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో పనిచేయనివ్వమని ప్రకటించారు. గతంలో భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజక వర్గాల్లో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను బయటకు పంపి పాఠశాలలకు తాళాలు వేశారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తామని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం బయటకు పంపారు. దీనిని నిరసిస్తూ లంబాడీలు ఆందోళన చేపడుతుండడంతో ఉద్రిక్తతకు దారి తీస్తుంది. రాస్తారోకో, ధర్నాలు, భారీ బహిరంగ సభలతో రిజర్వేషన్ కొనసాగించేందుకు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం ఆదివాసీలు, లంబాడీల మధ్య సమస్య పరిష్కారం చూపాల్సి ఉంది. లేకపోతే ఏజెన్సీలో రిజర్వేషన్ చిచ్చు శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉంది.

Comments

comments