Home ఆదిలాబాద్ లంబాడీల పోరాటం ఆగదు

లంబాడీల పోరాటం ఆగదు

Lambady's struggle does not stop

మన తెలంగాణ / ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు పోరాటం ఆగదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావు అన్నారు. శుక్రవారం ఐటీడిఎ కార్యాలయంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జెండా ఎగురువేశారు. అనంతరం పాలనాధికారి భీమ్‌కు వినతి పత్రాన్ని అం దించారు. అనంతరం బాపురావు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలన్నా రు. ప్రభుత్వానికి సంబంధించిన 29 శాఖల్లో విధులు నిరవహిస్తున్న లంబాడీ ఉద్యోగులు విధులకు హాజరు కావద్దన్నారు. ఆయా  ఉద్యోగులును విధులకు హాజరుకానివ్వమన్నా రు. ఒక వేళ హాజరైతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పెసా చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. 5వ షెడ్యూల్డ్‌లో 244(1), 244(2) ఆర్టికల్ ప్రకారం గ్రామ సభ తీర్మాణంతో గ్రామాల్లో స్వయం పాలనను అమలు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలు, ఆశ్రమాలు పునః ప్రారంభం కావడంతో ఆశ్రమాలకు విధులకు వెళ్లిన లంబాడీ ఉపాధ్యాయులను ఆదివాసీలు బహిష్కరించారు. లంబాడీ ఉద్యోగులు తమ గ్రామాల్లోకి రావద్దంటూ తీర్మాణం చేశారు. దీంతో ఉపాధ్యాయులు ఐటిడిఎ కార్యాలయం చేరుకొని సమస్యను ఉన్నతాధికారులకు వివరించారు. కొత్తగూడ గ్రామ శివారులో మా గ్రామంలో మా పాలన నినాదంతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.