Home తాజా వార్తలు భూ వివాదం … యువకుడి ఆత్మహత్య

భూ వివాదం … యువకుడి ఆత్మహత్య

Land Disputeమర్పల్లి (వికారాబాద్) : దాయదుల మధ్య  నెలకొన్న చిన్న భూవివాదాం చివరకు ఓ యువకున్ని బలితీసుకుంది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని కోత్లాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది.  గ్రామస్తులు తెలిపిన పూర్తివివరాల ప్రకారం …. గ్రామానికి చెందిన తోపుగొండ ప్రతాప్‌రెడ్డి, విఠల్‌రెడ్డి అన్నతమ్ములు. వీరికి అదే గ్రామానికి చెందిన రాయిరెడ్డి,శ్రీ నివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలు పాలి భాగస్థులు. వీరికి బస్టాండ్ సమీపంలో సర్వేనెంబర్ 200లో భూమి ఉంది. దీనిని ఇదివరకే భాగాలు చేసుకున్నారు. తమకు వచ్చిన భూమిలో   ప్రతాప్‌రెడ్డి కుమారులు ఇల్లు కడుదామని పిల్లర్లు వేసి స్లాబ్‌ వేసేందుకు సిద్ధం చేశారు. దీంతో మిగిలిన ముగ్గురు దాయాదులు రెండు, మూడుమీటర్లదూరం వరకు తమ భూమిలోకి వచ్చావంటూ 2017లో కోర్టులో కేసువేశారు. దీంతో ఈ వివాదాస్పద భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, పంటలు కూడా పండించరాదని కోర్టు స్టే ఇచ్చింది.  దీంతో వీరు  కోర్టు చుట్టుతిరుగుతూనే ఉన్నారు. దీందో వీరు గత నెల  29న వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అదే రోజు బల్వంత్ రెడ్డి (27) కోర్టుకు హాజరు కాలేదు. దీంతో దాయాదులు ఆయన ఇంటికి వెళ్లి తిట్టారు.దీంతో బల్వంత్ రెడ్డి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బల్వంత్ రెడ్డిపై కూడా దాయాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన బల్వంత్ రెడ్డి గురువారం పురుగుల మందు తాగాడు. వెంటనే బల్వంత్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. అనంతం బల్వంత్ రెడ్డి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తమకు న్యాయం జరిగే వరకు బల్వంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనివ్వమని ఆయన కుటుంబీకులు తేల్చి చెప్పడంతో, వివాదాస్పద భూమిలోనే బల్వంత్ రెడ్డి అంత్యక్రియలు చేయాలని వారు భీష్మించడంతో దాయాదులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఇరురవర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో దాయాదులను సిఐ శ్రీనివాస్ ఒప్పించడంతో పొలంలోనే  సమాది గుంతను తవ్వారు. అయితే సమాధి గుంత తవ్విన ప్రాంతంలో ప్లాట్లు అమ్ముకున్నామని, ఈ ప్లాట్లకు కొంతదూరంలో వెనుక భాగంలో బల్వంత్ రెడ్డిని సమాధి చేయాలని దయాదులు చెప్పడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో బల్వంత్ రెడ్డి అంత్యక్రియలు గ్రామశివారులోని శ్మశాన వాటికలో నిర్వహించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Land Dispute : Young Man Commits Suicide