Search
Thursday 15 November 2018
  • :
  • :

రాబర్ట్ వాద్రాపై ఎఫ్‌ఐఆర్

Land Grab Case : FIR Registered Against Robert Vadra

ఢిల్లీ : యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు , ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గురుగ్రామ్‌లో భూ అక్రమాల కేసుకు సంబంధించి ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వాద్రాతో పాటు హరియాణా మాజీ సిఎం భూపిందర్ సింగ్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భూ కొనుగోళ్ల లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ సురేందర్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. డిఎల్‌ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సంస్థల పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్టు మన్నేసర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. భూపిందర్‌సింగ్ సిఎంగా ఉన్న సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ గురుగ్రామ్‌లో భూమిని రూ.7.5 కోట్లకు కోనుగలు చేసి డిఎల్‌ఎఫ్ సంస్థకు రూ. 58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు సురేందర్ శర్మ తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా డిఎల్‌ఎఫ్ సంస్థకు నాటి రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, ఈ క్విడ్‌ప్రోకోలో డిఎల్‌ఎఫ్‌కు రూ.5000 కోట్ల లబ్ధి చేకూరిందని సురేందర్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై వాద్రా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే బిజెపి ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Land Grab Case : FIR Registered Against Robert Vadra

Comments

comments