Home నిర్మల్ బుట్టాపూర్ గ్రామ పరిధిలోని భూములను పేదలకివ్వాలి

బుట్టాపూర్ గ్రామ పరిధిలోని భూములను పేదలకివ్వాలి

land

భూ పోరాట నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి
సాగు చేస్తున్న భూములకు పట్టాలు, నీటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు,

మనతెలంగాణ/నిర్మల్‌టౌన్: దస్తురాబాద్ మండ లం లోని బుట్టాపూర్ గ్రామ పరిధిలోని 140సర్వే నెంబర్‌లో భూములను పేదలకివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మి క సంఘం, బుట్టాపూర్ భూపోరాట సమితి నాయ కులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం డిఆర్‌ఓ రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం సమ ర్పించారు. బుట్టాపూర్  గ్రామపరిధిలో 140 సర్వే నెంబర్ లో సుమారుగా 2000 ఎకరాల భూమి ఉందన్నారు. చాలా ఏళ్ల నుంచి సుమారు 1500 ఎకరాల భూమి బుట్టా పూర్, మల్లాపూర్, రేవోజిపేట్ కలమడుగు, నర్సింగాపూర్ గ్రామల్లో ప్రజలు సాగు చేసుకోని జీవి స్తున్నా రన్నారు. ఈ సర్వే నెంబర్‌లో గ్రామం ఉండగా తరచూ అట వీ శాఖ అధికారులు అడ్డు కుంటూ అక్రమంగా కేసులు నమోదు చేస్తు న్నారన్నారు. 1960నుంచి ఈ భూములపై హక్కుల పోరాటం చేయడం జరుగుతుందన్నారు. కడెం ప్రాజెక్ట్  ఉపకాలువైన 7,8 నెంబర్‌లో  ఉప కాలువలున్నాయని వారు పేర్కొ న్నారు. ఈ భూము లకు నీరంద కుండా 8వ నెంబర్ కాలువను ప్రారంభించలేదని ఆరో పించారు. వీటికి వ్యతి రేకంగా పోరాటాలు చేస్తే 60మందికి పైగా అక్రమంగా అటవీ శాఖ అధికారులు కేసు లను నమోదు చేస్తున్నారన్నారు.అలాగే ఉప కాలువ తెరిచి నీరందించాలన్నారు. వీరికి మద్ద తు టగా టి మాస్ జిల్లా కన్వీనర్ కిషన్ కుమా ర్, బిఎల్ ఎఫ్ నాయకులు దోర రామా గౌడ్, సిపి ఎంజిల్లా కార్యదర్శి ఎస్‌కె.దాదేమి యా లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బిఎల్‌ఎఫ్ నాయకులు మహిమూద్, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి  దూర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేష్, శ్రీనివాస్, రజిత, శంకరమ్మ, రాజవ్వ, కళవ్వ, గంగా మణి, భాగ్య లక్ష్మీ, చిట్యాల రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.