Home జోగులాంబ గద్వాల్ జోగుళాంబ జిల్లాలో ‘నేతల’ భూమేత

జోగుళాంబ జిల్లాలో ‘నేతల’ భూమేత

పేదలకిచ్చిన భూములను కబ్జాపెట్టిన అధికార పార్టీ నేతలు
అయిజలో రూ.5కోట్ల విలువ గల భూములు అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

                             land-mafia2

గద్వాల ప్రతినిధి: ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసిన భూకుంభ కో ణాలే… ఆభూములను చెర పట్టింది కూడ అధికారం లో ఉన్న పెద్దమనుష్యులే అని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు భూకుంభకోణం వ్యవహారం పెద్ద తల నొప్పి తెచ్చిపెట్టింది… వాటిని సరిచేసే క్రమంలో దిద్దుబా టు చర్యలను చేపట్టారు… రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వాలు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశాయి… ఈక్రమం లో అక్రమాలకు పాల్పడిన సబ్‌రిజిస్ట్రార్లు, ఇతర అవినీతి అధికారులపై ఏసీబీ రైడింగులు, సస్పెన్షన్లతో వేటు వేస్తుంది… అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం అవినీతికి పాల్పడిన నేతలపై కూడ చర్యలు చేపట్టాలంటూ ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి… అయితే ఇదంతా తెలిసిన స్టోరే కదా… ఎందుకు చెబుతున్నారని అనుకుం టున్నారా…? సంబంధం ఉంది… జోగుళాంబ జిల్లాల్లో కూడ విలువైన ప్రభుత్వ భుములను అధికార పార్టీకి చెం దిన కొందరు నేతలు చెరపట్టారు.

ఇలా చెరపట్టిన ప్రభుత్వ భూములను తమకున్న పలుకు బడితో నేతలు వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ సైతం చేయించు కున్నారు. పైగా ఇందులో అనుమతులు లేకుండానే దర్జాగా లేఅవుట్ ద్వారా ప్లాట్లను ఏర్పాటు చేశారు. తరువాత తమ అక్రమార్జనకు తెరలేపారు. ఈభూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.5కోట్ల వరకు ఉంటుంది. దీనిపై మనతెలంగాణ ఆర్టీఐ చట్టం ద్వారా సంబంధిత రెవెన్యూ శాఖలో వివరాలను సేకరించింది. రెవెన్యూ శాఖ ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన విష యం బట్టబయలైంది.. ఈఅవినీతి భూభాగోతంపై ‘మన
తెలంగాణ’ ప్రత్యేక కథనం.

నేతల భూమేత….:జోగుళాంబ గద్వాల జిల్లా ముందు నుంచి మంచి స్తిరాస్తి వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ రియల్‌ఎస్టేట్ వ్యాపారం కూడ హైదారాబాదు స్థాయిలో ఉంటుందని జిల్లాల్లో ఎవరిని అడిగినా ఠకీమని చెప్పేస్తారు. అయిజ మండల కేంద్రమైన అయిజ పట్టణంలో సర్వే నంబరు 65లో మొత్తం 23.06ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉంది. ఇందులో సీలింగు ద్వారా గతంలో భూమిలేని పేదలకు 7.76ఎకరాల భూమిని పంపిణీ చేశారు. మిగతా 16.10ఎకరాల భూమి పట్టాభూమిగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇలా ప్రభుత్వం ఇచ్చిన సీలింగు భూమిలో లబ్ధిదారులు కొంత కాలం సాగుచేసుకుంటు జీవనం చేస్తువచ్చారు.

అయితే హైదారాబాదులో రియల్ ఎస్టేట్ భూం బాగా పెరిగిన సమయంలో ఇక్కడి భూములకు కూడ విపరీతమైన డిమాండు వచ్చి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు అక్రమార్కులకు ఈసీలింగు భూమిపై కన్ను పడింది. పట్టణానికి సమీపంలో ఉన్న ఈభూమిని ఎలాగైనా చెరపట్టాలను
కున్నారు. అంతే తమకున్న పలుకుబడిని ఉపయోగించి సీలింగు యాక్టును సైతం పక్కన పెట్టి ఇందులో 3ఎకరాల భూమని కొనుగోలు చేశారు. వాటిని తమకున్న రిజిస్ట్రేషన్ కూడ చేయించుకున్నారు. ఇంకేముంది ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇందులో ప్లాట్లను తయారు చేశారు.

నిబంధనలకు తూట్లు….:

1).వాస్తవానికి సీలింగు ద్వారా ఇచ్చిన భూములను కొనడం, కాని అమ్మడం కాని చేయ టానకి వీలులేదని చట్టం స్పష్టం చేస్తుంది. కాని రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు అవినీతి అధికారులతో చేతులు కలిపి దర్జాగా తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

2).సీలింగు భూమిలో ప్లాట్లలకు సంబంధించిన వెంచర్ నిర్మాణం చేయాటానికి రెవెన్యూ, మున్సిపాలిటీ ఏవిధంగా అనుమతులు ఇచ్చారో కూడ తెలియదు.

3).ఇలా మూడెకరాల భూమిలో 40/50 సైజులో మొత్తం 120 ప్లాట్లను తయారు చేశారు. వీటిని ప్రస్తుం మార్కెట్ ధర ప్రకారం ఒక్కో ప్లాటను రూ.60వేల నుంచి మొదలుకుని రూ.3లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్లాట్లను విక్రయించి వాటిని రిజిస్ట్రేషన్ సైతం చేయిస్తున్నారు.

అసలు మతలాబు ఇక్కడే ఉంది…:వాస్తవానికి సీలింగు యాక్టు ప్రకారం సీలింగు భూమిని కొనడం అమ్మడం కాని వీలుపడదు. అయితే ఇదే సర్వేనంబరు 65లో 16.10ఎకరాల విస్తీర్ణం గల భూమి పట్టాగల భూమి. టెక్నికల్‌గా రిజిస్ట్రేషన్ సమయంలో పట్టాభూమిని చూపెడుతూ క్షేత్రస్థాయిలో మాత్రం సీలింగు భూముల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లను విక్రయిస్తుండడం గమన్హారం. అయితే ఈవ్యవహారం అటు రెవెనూ, ఇటు రిజిస్ట్రేషన్
శాఖ అధికారులకు తెలిసినప్పటికీ టెక్నికల్‌గా దొరకమనే ధైర్యంతో అవినీతి అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కులకు వంత పాడుతున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి అన్యాక్రాంతమైన సీలింగు భూమిని కాపా డాలని స్థానికులు కోరుతున్నారు.

తహసీల్దార్ ఏమన్నారంటే…:

మీరు చెబుతున్న సీలింగు భూమిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. నేను ఇటివలీ ఇక్కడికి బదిలీపై వచ్చాను. ఇదంతా గతంలో జరిగిన వ్యవహారం. విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారికి నోటిసులు ఇచ్చి సీలింగు భూమిని కాపాడుతామంటూ మన తెలంగాణకు వివరణ ఇచ్చారు.