Home భద్రాద్రి కొత్తగూడెం కెటిపిఎస్ యాష్‌పాండ్ భూ నిర్వాసితుల దీక్ష విరమణ

కెటిపిఎస్ యాష్‌పాండ్ భూ నిర్వాసితుల దీక్ష విరమణ

Deekha

పాల్వంచ: భద్రాద్రి జిల్లా సూరారం కెటిపియస్ యాష్‌పాండ్ వద్ద 40 రోజులుగా భూ నిర్వాసితులు చేస్తున్న నిరా హార దీక్షలు గురువారం విరమించారు. బుధవారం హైద్రాబాద్ విద్యుత్ సౌధ లో టిఎస్‌జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు నిర్వాసి తుల పక్షాన జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

సిఎండి ఇచ్చిన స్పష్ట మైన హామీ మేరకు కెటిపియస్ సిఇ రత్నాకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షలను విర మించపజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పేదల పక్షా న సిపిఐ ముందుండి పోరాడుతుందన్నారు. ఉద్యోగాలిస్తామని భూము లు తీసుకుని ఉద్యోగాలివ్వకపోవడంతో భూము లు కోల్పోయిన కుటుం బాలు ఆకలితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. గత్యంతరం లేక పోరా టాలకు దిగిన నిర్వాసితులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పేదల పక్షాన హైద్రాబాద్‌లో జెన్‌కో ఉన్నతాధికారులతో చర్చించినట్లు చెప్పారు.