Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అయిజలో… భూమాయగాళ్లు

Land-Scam

గద్వాలప్రతినిధి: అయిజ నగర పం చాయతీ పరిధిలోని సర్వే నంబరు 65లో ఉన్న సీలింగు భూమి 3ఎకరాల్లో తవ్వే కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి.. రూ.5కోట్లు విలువ చేసే భూమిని దర్జా గా వక్రమార్గంలో చెపట్టి దానిపై కాసుల పంటను పం డించుకుంటున్నా సంబంధిత అధికారులు కనీసం దానిపై ప్రశ్నించే సహసం కూడ చేయడం లేదంటే దాని వెనకాల పెద్దల హస్తమే ఉందని స్పష్టమవుతుంది. ఆదిశగానే మనతెలంగాణ అవినీతి పరుల వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది… విస్తూగొలిపే కొన్ని విష యాలు వెలుగు చూశాయి.. ఇక్కడ వీరు ఎంత చెబితే అంత… ఏమన్న అంటే తమకున్న అధికారాన్ని ప్రదర్శి స్తారు… ఇంకా ఎక్కువగా మాట్లాడితే తమకున్న అండను చూపెడుతూ బెదిరింపులకు పాల్పడుతారు… దీంతో వారు ఏమి చేసినా అడిగే నాథుడే లేకుండా పోయ్యారు.

భూమాయగాళ్లు…: అయిజకు చెందిన ఎం.సావిత్ర మ్మ భర్త చిన్నరాముడు చెందిన సర్వే నంబరు 65/ సీ1లో 2.28ఎకరాలు, అయిజ మండలం ఉప్పల లక చెందిన ఎన్.సత్యమ్మ భర్త రాధాకృష్ణారెడ్డికి చెందిన సర్వే నంబరు 65/సీ2/1, 0.33 ఎకరాలు ఇలా మొ త్తం 3-21ఎకరాల భూమిని అయిజ మండలం ఉప్పల క్యాంపు గ్రామానికి చెందిన అలువాల చంద్రమోహ న్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు చూ పుతున్నాయి. అయితే సావిత్రమ్మ, సత్యమ్మ పాసుపు స్తకాలను పరిశీలిస్తే వీరి పుస్తకాలపై తహశీల్దార్ల సం బంధించి వేరు వేరుగా ఉన్న సంతకాలు కనిపిస్తున్నా యి.

అంటే తహశీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేశారా…? అదే కాకుండా సావిత్రమ్మకు చెందిన పాసుపుస్తకంలో సర్వేనంబరు 65/సీ1లో మొత్తం 2.35ఎకరాల విస్తీ ర్ణం గల ఖుష్కితరి భూమి ఉంటే చంద్రమోహన్‌రెడ్డి రిజి స్ట్రార్ డాక్యుమెంటులో మాత్రం సర్వే నంబరు 65/సీ1 కింద 2.28 ఎకరాలుగా చూపెట్టడం జరిగింది. పాసు పుస్తకాల్లో ఇన్ని రకాల తహశీల్దార్ల సంతకాల దిద్దుబా టులు, పొరపాట్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ కార్యాల యంలో మాత్రం సదరు రిజిస్ట్రార్ అధికారి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్త పరుచకుండా రిజిష్ర్టేషన్ చేయించ డం గమన్హారం. అధేవిధంగా తహశీల్దార్ కార్యాలయం లోని ఆర్వోఆర్‌లో సర్వే నంబరు 65/డీ లో చంద్రమో హన్‌రెడ్డి పేరును చేర్చడం కనిపిస్తుంది.

అంటే కొనుగో లు చేసిన సర్వే నంబర్లకు తహశీల్దార్ కార్యాలయం లోని ఆర్వోఆర్ లో ఉన్న సర్వే నంబర్లక ఎక్కడా కూడ పొంత లేదంటే అక్రమాలు ఏస్థాయిలో జరిగాయ్యో స్పష్టమవుతుంది. ఈ అక్రమాల్లో ప్రధానంగా అయిజ కు చెందిన ఓ రేషన్ డీలర్ భర్త, అధేవిధంగా పట్టణం లోని అధికారంలో ఉన్న ఓముఖ్య నేత కుమారుడి హస్తం ఉన్నట్లు తెలిసింది. వీరు అక్రమాలకు సహకరిం చినందుకు నజరానాగా డీలర్ భర్త కుటుంబ సభ్యుల పేరిట, ముఖ్య నేత కుమారుడి పేరిట పదిలక్షల విలువ కలిగిన ప్లాట్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తుంది.

చక్రం తిప్పుతున్న డీలర్ భర్త…: ఈమొత్తం వ్యవహా రంలో అయిజకు చెందిన రేషన్ డీలరు భర్తే అసలు సూత్రదారిగా తెలుస్తుంది. ఈయనకు పెద్దల అండ సం పూర్ణంగా ఉండడంతో రెవెన్యూ తహశీల్దార్ కార్యాల యంలో డీలర్ భర్త ఎంత చెబితే అంత అని.. నిత్యం ఈకార్యాలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తుంటాడని అక్కడి వారు చెబుతున్నారు. తహశీల్దార్ కార్యాలయం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి కూడ డీలర్ భర్త మాదిరి కార్యాలయంలో కనిపించరని చెబుతున్నారు.

Comments

comments