Search
Friday 21 September 2018
  • :
  • :

కొత్త నోటుపై కొత్త కలకలం

Two-Thousand-Noteఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ… వీటి స్థానంలో కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండు వేల రూపాయల నోటుపై సోషల్ మీడియాలో ఓ పుకారు కలకలం సృష్టించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ. 2వేల నోటును ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతోందనేది దీని సారాంశం. నోటు వెనక భాగంలో 15 భాషల్లో నోటు విలువను ముద్రిస్తారనేది మనకు తెలిసిన విషయమే. కాగా భాషల ముద్రణలో ఓ దోషం(‘దోన్ హజార్ రుపయా’ అని ఒకసారి, ‘దోన్ హజార్ రూపయే’ అని మరోసారి) ఉందని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అన్ని నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు పుకారు షికారు చేసింది. కానీ నోట్లలో ఎలాంటి తప్పు లేదని.. నోటులో ముద్రించిన భాషల ప్యానల్‌లో అసలు హిందీ లేదని.. మిగిలిన మరో 15 భారతీయ భాషలలో రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేటట్లు ముద్రించినట్లు తెలుస్తోంది. తప్పు దొర్లినట్లు భావిస్తున్న రెండింటిలో ఒకటి మరాఠీ కాగా మరొకటి కొంకణి కావచ్చని అంటున్నారు. కావున కొత్త నోటుపై వస్తున్న రూమర్స్‌ను నమ్మొద్దని అభిప్రాయపడుతున్నారు.

Comments

comments