Search
Thursday 15 November 2018
  • :
  • :

ఇక పెద్ద పేగు రెక్టం క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం

cancer
మన తెలం గాణ/ముషీ రా బాద్ : అత్యంతక్లిష్టతరమైన పెద్ద పేగు రెక్టం క్యాన్సర్ వ్యాధికి ఇక ఆధు నిక వైద్యం అందుబాటులో వచ్చిందని ప్రముఖ ఆంక లా జిస్ట్ డాక్టర్.జగదీశ్వర్ గౌడ్ గజా గౌని వెల్లడించారు. అడ్వా న్స్‌ ల్యాప్రో స్కోపి అండ్ రోబోటిక్ వైద్య ప్రక్రి యలో ఇది అత్యంత సుల భ మని ఆయన పేర్కొన్నారు. సోమవారం సికింద్రాబాద్ యశోద్ ఆసుపత్రిలో జరిగిన ‘పెద్ద పేగు రెక్టం క్యాన్సర్- ఆధునిక వైద్యం’ జాతీయ వర్క్ షాప్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఢిల్లి, ముంబాయి, బెంగుళూరు, కోల్ కత్తా సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యు లకు జగదీశ్వర్ గౌడ్ సూచనలు అందించారు. పెద్ద పేగు రెక్టం క్యాన్సర్‌తో బాధపడుతున్న పలువురి పేషెంట్లకు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యుల సమక్షంలో శస్త్ర చికిత్సలను నిర్వహించారు. కోలాస్టమి బ్యాగ్ (దొడ్డి బ్యాగ్) అవసరం లేకుండా సాధారణస్థితి ఆ రోగులను ఎలా తీసుకురావచ్చో వివరిం చారు. క్యాన్సర్ స్పైడ్ లింప్నోట్స్‌ను ఎక్కువ శాతంలో తీసి వేయడం ఫలితాన్ని ఇస్తుందన్నారు. ఒక ప్పుడు ఆధునిక వైద్యం కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే వారని, ప్రస్తుతం పరిస్థితి మారుతుందన్నారు. ప్రముఖ రేడియేషన్ ఆంక లా జిస్ట్ డాక్టర్.ఎంబి.వికా స్ కు మార్, ప్రొఫె సర్లు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ వర్క్ షాపులో పాల్గొ న్నారు.

Comments

comments