Search
Wednesday 26 September 2018
  • :
  • :

తెలంగాణ సంస్కృతిపై లేజర్ షో!

 ఓపీఎస్ టెక్నాలజీతో ప్రదర్శనలు
 రెండు ప్రత్యేక థీంలు
 వ్యయం అంచనా రూ. 3.50 కోట్లు
 టెండర్లు పిలిచిన హెచ్‌ఎండీఏ
 మరో నాలుగు మాసాల్లో అందుబాటులోకి..
lazer-showసీటీబ్యూరో : నగర వినోద ప్రియులకు శుభవార్త…. పర్యాటకులకు అమితాసక్తిని కలిగించే విషయం… దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయోగం… ఇక లేజర్ షోలో తెలంగాణ సంస్కృతి ప్రదర్శన. చూపరులను కట్టిపడేసే జనపదం… జానపదంలో నృత్యాలు… వీనుల విందైన పాటలు… ఆసీనులను ఉర్రూతలూగించే సంగీతం… వీటితో పాటు తెలంగాణ చరిత్ర… ఒక్కటేమిటి ఒక్కమారు చూస్తే పలుమార్లు తిలకించాలనిపించే విధంగా లుంబినీపార్కులోని లేజర్ షోను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తోంది హెచ్‌ఎండీఏ. గ్రామీణ వాతావరణంలో పాడుకునే పాటల్లో, చేసే నృత్యాల్లోనే తెలంగాణ ప్రాశస్తాన్ని ప్రతిబింబించే థీంలను ప్రవేశపెడుతోంది హెచ్‌ఎండీఏ. ఆ క్రమంలోనే గత మంగళవారం టెండర్లను పిలిచింది సంస్థ. రూ. 3.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లేజర్ షోలను ప్రదర్శించాలని అథారిటీ నిర్ణయించి టెండర్లలో స్పష్టంగా తెలిపింది.
అత్యాధునిక టెక్నాలజీ…
ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అయిన ఒపీఎస్ టెక్నా లజీని వినియోగించి నగరంలోని లుంబినీ పార్కులో లేజర్ షోను ఆధునీకరించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయిం చింది. నగర వినోద ప్రియులకే కాకుండా నగరా నికి వచ్చే దేశ విదేశ పర్యాటకులను తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. హైదరా బాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న సిఎం ఆలోచలకు తగ్గట్టుగా ఈ లేజర్ షో ఉండాలనే పట్టుద లతో టెండర్లను పిలిచినట్టు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ అంటే జాన పదాలు… జనాల్లో ఉత్సాహం ఉరకలు వేసేట్టుగా ఉండే నృత్యాలు… పాటలు రాగాలు… దరువులు… ఇందులో ఇమిడి ఉండే విధంగా రెండు ప్రత్యేక థీంలను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నేపథ్యంలో భాగమతి థీం ఉన్నదని, దానితో పాటు మరో రెండు కొత్త థీంలు మళ్ళీమళ్ళీ షోల కు రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని సంస్థ పట్టుదలతో ఉంది. ఫౌంటేయిన్, సంగీతం వాటిల్లో కూడా ఓపిఎస్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
2005లో ప్రారంభం…
లుంబినీ పార్కులో లేజర్ షో 2005లో ప్రారంభించారు. షోను 2000 మంది తిలకించేందుకు అనుకూలంగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రదర్శనశాలను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసింది. అప్పటి నుండి లేజర్ షో నగరానికి వచ్చే పర్యాటకులను, వినోదాన్ని ఆస్వాదించే నగర వాసులను అమితంగా ఆకట్టుకొంటోంది. అయితే, మూస ధోరణిలో కాకుండా మారుతున్న పోకడలకు అనుగుణంగా లేజర్‌షోలు ఉండాని కమిషనర్ శాలినీ మిశ్రా అధికారులకు సూచించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే జాతీయ స్థాయిలో నిపుణులున్న సంస్థలను ఆహ్వానించే విధంగా టెండర్లను పిలిచినట్టు కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరో నాలుగు మాసాల్లో ఇది కార్యరూపంలోకి రావచ్చని అధికార యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సంస్కృతి జానపద రీతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉండే ఈ లేజర్ షోలను తిలకించాలంటే మరి నాలుగు మాసాలు ఆగాల్సిందే.

Comments

comments