Home ఆఫ్ బీట్ నేడు లష్కర్ బోనాలు

నేడు లష్కర్ బోనాలు

ఆషాఢ బోనాలతో భాగ్యనగరం కొత్తశోభను సంతరించుకుంది. నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వయంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. 3 కిలోల 80గ్రాముల బంగారు  బోనాన్ని సిఎం కెసిఆర్, ఎంపి కవిత అమ్మవారికి సమర్పించనున్నారు.                                -మన తెలంగాణ/సిటీబ్యూరో

బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, ఎంపీ కవిత
పలు ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
1016 బోనాలతో భారీ ఊరేగింపు
భారీ బందోబస్తు నడుమ ఉత్సవాల నిర్వహణ
పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు

Bonalu

మనతెలంగాణ/సిటీబ్యూరో: ఆషాఢ బోనాలతో భాగ్యనగరం కొత్త శోభను సంతరించుకుంది. నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వయంగా ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అమ్మవారికి సమర్పించేందుకు 3 కిలోల 80గ్రాముల బంగారంతో బోనంను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ఆదయ్యనగర్ కమాన్ నుండి బంగారు బోనంతో పాటు 1016 బోనాలతో అమ్మవారి ఆలయం వరకు భారీఎత్తున జరిగే ఊరేగింపు కార్యక్రమాన్ని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభిస్తారు.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బంగారు బోనంతో ఊరేగింపులో పాల్గొంటారు. ఊరేగింపుకు ముందు 400 మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. అంతేకాకుండా బంగారు బోనంతో పాటు బోనాలు తీసుకొచ్చే మహిళలందరూ ఒకేరకమైన చీరలను ధరించేలా ఏర్పాట్లు చేశారు. బోనాల ఊరేగింపు మహంకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకొన్న అనంతరం బోనం సమర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా రెండు నెలల ముందు నుండే వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల నిఘా నేత్రాలో బందీఅయి ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ముందస్తుగానే తీసుకుంది.

ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ.: నగరంలోని ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. చిలకల గూడ కట్టమైసమ్మ ఆలయానికి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరన్ రెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయానికి మంత్రి తలసాని శ్రీనివాసయాద్, లాల్ దర్వాజ మహాకాళి ఆలయానికి మహమూద్ అలీ, మీరాలమండీ మహాకాళేశ్వర ఆలయానికి నాయిని, కార్వాన్ దర్బార్ ఆలయంలో నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు: రాణిగంజ్ ఎక్స్‌రోడ్స్ వైపు నుంచి వచ్చే జనరల్ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులు మినిస్టర్ రోడ్డు, రసూల్‌పురా ఎక్స్‌రోడ్డు, సీటీవో ఏబీహెచ్ ఎక్స్‌రోడ్డు, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లేన్ల మీదుగా రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్ఫా హోటల్ ఎక్స్ రోడ్స్, ఓల్డ్ గాంధీ ఎక్స్ రోడ్స్, సజ్జన్‌లాల్ స్ట్రీట్, ఓల్డ్ మహంకాళి ట్రాఫిక్ పీఎస్, ఘాస్‌మండి, బైబిల్ హౌస్,కర్బలా మైదాన్ మీదుగా వెళ్తాయి. బైబిల్ హౌస్ నుంచి వచ్చే జనరల్ ట్రాఫిక్ ఘాస్‌మండి ఎక్స్‌రోడ్డు వద్ద సజ్జన్‌లాల్ స్ట్రీట్, హిల్‌స్ట్రీట్ వైపు మళ్లాలి. రైల్వే స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట్ వెళ్లే బస్సులు క్లాక్‌టవర్, ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్, ఏబీహెచ్ ఎక్స్‌రోడ్స్ మీదుగా వెళ్లాలి. ప్యాట్నీ ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను ప్యాట్నీ ఎక్స్‌రోడ్డు నుంచి క్లాక్‌టవర్, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు. సీటీఓ జంక్షన్ వద్ద ఎంజీ రోడ్డు వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సింథికాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ ఎక్స్‌రోడ్డు, కర్బలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు.

Bonalu Festival Started in Hyderabad

పార్కింగ్ ప్రదేశాలు: స్వీకార్ ఉపకార్, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలను హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ ఆవరణలో పార్కు చేసుకోవాలి. కర్బలామైదాన్, బైబిల్ హౌస్‌ల వైపు నుంచి వచ్చే వెహికిల్స్‌లను ఇస్తామియా హైస్కూల్‌లో పార్కింగ్ చేసుకోవాలి. రాణిగంజ్,ఆదమయ్య ఎక్స్‌రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదయ్య మెమోరియల్ స్కూల్‌లో ఉంచాలి. సుభాష్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్‌ఖానా వద్ద పార్క్ చేసుకోవాలి. మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు: సికింద్రాబాద్ బోనాల పండుగను పురస్కరించుకుని ఆ ప్రాంతంలో పలు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసు శాఖ విధించింది. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి రేపు(30న) రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. మహాంకాళి ఆలయానికి వెళ్లే టొబాకొ బజార్, జనరల్ బజార్, హిల్‌స్ట్రీట్ రోడ్లలో వాహనాలకు ప్రవేశం లేదు. బాటా షోరూం నుంచి పాత రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వరకు సుభాష్‌రోడ్డు, మహంకాళి ఆలయం నుంచి ఆదయ్య ఎక్స్ రోడ్డులో ఎటువంటి వాహానాలకు ప్రవేశం ఉండదు.