Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యురి దాడికి బాధ్యులము మేమే : లష్కరే తోయిబా

Uri-Attackన్యూఢిల్లీ : గత నెలలో యురి సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 19మంది జవాన్లు ప్రాణాలు కోల్పగా… కొందరు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. కాగా యురి ఘటనకు తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఎ తొయిబా స్పష్టం చేసింది.
యురి ఘటనలో మరణించిన ఓ ఉగ్రవాది కోసం ఎల్‌ఇటి మాతృ సంస్థ అయిన జమత్-ఉద్-దవా(జెయుడి) పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రార్థనల తర్వాత జెయుడి చీఫ్ హఫీజ్ సయీద్ మాట్లాడినట్లు సమాచారం. ఈ పోస్టర్లలో భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసి ఎల్‌ఇటికి చెందిన మహ్మద్ అనాస్ అలియాస్ అబు-సరఖా అమరుడయ్యాడని ఉర్దూలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ల ప్రకారం ఎల్‌ఇటి ఉగ్రవాదులు 177 మంది భారత సైనికులను చంపారని చెప్పుకుంటుంన్నట్లు తెలుస్తోంది.

Comments

comments