Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మొన్న చాయ్ వాలా… నిన్న సబ్జీవాలి… ఈరోజు మిర్చీ వాలి

కొంత మంది ఫేమస్ కావడానికి ఎన్నో కష్టాలు పడతారు. అయితే, ఈ రోజుల్లో.. ఈ జనరేషన్ లో ఫేమస్ అవడం చాలా ఈజీ. ఈ జనరేషన్ అంతా హైటెక్ కదా… టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తో ఎంతో ఈజీగా రాత్రికి రాత్రే స్టార్లు అయిన వాళ్లు మన దేశం కాదు… ప్రపంచంలోనే చాలా మంది ఉన్నారు.

రీసెంట్ గా ఓ చాయ్ వాలా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఈ చాయ్ వాలా ఫోటోను సరదాగా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది ఓ యువతి. అంతే రాత్రికి రాత్రే మనోడు స్టార్ అయిపోయాడు. అంతే కాదు, మనోడికి బంపర్ ఆఫర్ ఇస్తూ తన యాడ్ ఫిలింకు సెలెక్ట్ చేసుకుంది ఓ కంపెనీ. ఇక మనోడు రాత్రికి రాత్రే స్టార్ అవ్వడమే కాదు… కోటీశ్వరుడు కూడా అయిపోయాడు. ఇది చాయ్ వాలా స్టోరీ..

ఇక, సబ్జీవాలీ స్టోరీలోకి వెళ్తే…. నేపాల్ కు చెందిన ఓ అమ్మాయి… కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే, ఈ సబ్జీవాలీ ఫోటోను కూడా ఎవరో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే, వెంటనే సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది ఆ అమ్మాయి. అది సబ్బీవాలీ స్టోరి.

ఇప్పుడు మిర్చీవాలీ వంతు… చైనాలోని ఓ కూగ్రామానికి చెందిన ఈ అమ్మాయి… మిర్చీలు అమ్ముతుందట. అయితే, ఇంత క్యూట్ గా ఉన్న ఈ అమ్మాయి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రాత్రికి రాత్రే స్టార్ అయి కూర్చుంది ఈ అమ్మాయి. అంతే కాదు, ఇప్పుడు ఉన్న హీరోయిన్లందరినీ తలదన్నేలా ఈ అమ్మాయి ఉందంటూ, మిర్చీ కన్నా తనే హాట్ గా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వచ్చి పడుతున్నాయి. మిర్చి గర్ల్ పేరుతో సోషల్ మీడియాలో తెగ వైరలయిపోతుంది మిర్చివాలీ. ఈమెకు కూడా ఏదో ఒక బంపర్ ఆఫర్ వచ్చేస్తుందని హామీ ఇస్తున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మిర్చీ గర్ల్ ఫోటోలు ఇవే…..

Comments

comments