హైదరాబాద్ : నోవాటెల్ హోటల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. వీఎల్ఎస్ఐ డిజైనింగ్ అకాడమీ హైదరాబాద్‌కు రాబోతుందని ఆయన వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే సెమి కండక్టర్లు 1/3 వంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయన్నారు. భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటి పరిశ్రమకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారుతోందని వెల్లడించారు.