Home తాజా వార్తలు స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్

Lavanya Tripathi‘అందాల రాక్షసి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆతర్వాత కెరీర్ నెమ్మదించినా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మళ్లీ జోరందుకుంది. ఈ సినిమా లావణ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అమ్మడి తలుపు తట్టినా… మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోలేక పోయింది. ఈ బ్యూటీకి యాక్టింగ్ టాలెంట్ ఉంది. గ్లామర్ పుష్కలంగా ఉంది. సినిమాల్లో మరీ ఓవర్ డోస్ గ్లామర్ ప్రదర్శన చేయలేదు కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది ఈ భామ. తాజాగా సోషల్ మీడియాలో తన కొత్త ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఈ ఫొటోల్లో పెద్దగా గ్లామర్ చూపించక పోయినా స్టైల్‌తోనే అదరగొడుతోంది. ఈ భామ స్టైలిష్ లుక్ యూత్‌ను మురిపిస్తోంది. ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ‘అర్జున్ సురవరం’ సినిమాలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lavanya Tripathi Stylish look on Social Media