Home సినిమా నాగచైతన్యతో లావణ్య రొమాన్స్

నాగచైతన్యతో లావణ్య రొమాన్స్

Lavanya-Tripathiఅక్కినేని నాగార్జునకు జోడీగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నటించి అలరించింది యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఈ భామ నాగచైతన్యతో రొమాన్స్ చేస్తోంది. మొదట ‘మనం’ మూవీలో చైతన్యతో కలిసి చిన్న క్యారెక్టర్ చేసిన ఆమె ఇప్పుడు అతనికి జోడీగా హీరోయిన్‌గా నటిస్తోంది. “మనం సెట్స్‌లో మొదట చైతూని కలిశాను. చాలా తక్కువ సమయమే కలిసి పనిచేసినా అది మంచి అనుభవం. ఆతర్వాత నాగార్జునతో కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో కలసి నటించాను. ఇప్పుడు చైతూకు జోడీగా నటించే అవకాశం ఇంత తొందరగా రావడం ఎంతో ఆనందంగా ఉంది”అని చెప్పింది లావణ్య త్రిపాఠి. “కామెడీతో పాటు సస్పెన్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామా ఇది. నేను ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేశాను. తన ప్రియుడి లక్షాన్ని అందుకునేందుకు సహాయం చేసే కీలకమైన పాత్ర చేశాను”అని ఆమె పేర్కొంది. ఇక కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.