Search
Saturday 22 September 2018
  • :
  • :

లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు ఎంపిక

TS-LAWCETవరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాసెట్ ప్రవేశ పరీక్ష్ ప్రశ్నా పత్రాలను కాకతీయ యూనివర్సిటీ విసి చిరంజీవులు ఎంపిక చేశారు. లాసెట్ మూడేళ్ల ఎల్‌ఎల్‌బి ప్రవేశ పరీక్షకు భగీరథ ఎస్-1 ప్రశ్నాపత్రం, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి ప్రవేశ పరీక్షకు రామప్ప ఎస్-1 ప్రశ్నాపత్రం, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు గోల్కొండ ఎస్-2 ప్రశ్నా పత్రాన్ని ఎంపిక చేశారు. మూడు, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బి ప్రవేశ పరీక్ష ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయి.

Comments

comments