Home తాజా వార్తలు రైతు ఆత్మహత్యల వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

రైతు ఆత్మహత్యల వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

high-courtరైతు ఆత్మహత్యల వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.  రైతు ఆత్మహత్యల నివారణకు చేపట్టిన చర్యలు తెలపాలని తెలంగాణ, ఎపి ప్రభుత్వాలని కోర్టు అడిగింది. చేపట్టిన చర్యలపై కౌంటర్ దాఖలు చేశామని ఎపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎపి ప్రభుత్వం తెలిపిన వివరాలు కొంత సంతృప్తిగా ఉన్నాయని కోర్టు వాఖ్యనించింది. చేపట్టిన చర్యలపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రైతు ఆత్మహత్యలు ఆపాలన్నదే తమ ఉద్దేశమని కోర్టు ఈ సందర్భంగా వివరించింది. కోదండరాం, ఇతరుల వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.