Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న బాబు

Laxmi-Parvathi

హైదరాబాద్: నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా  ఆయన సతీమణి లక్ష్మీపార్వతి  ఎన్టిఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఎన్‌టిఆర్ జయంతికి, నేటి జయంతికి ఘాట్ వద్ద ఏర్పాట్లలో చాలా తేడా ఉందని, ఘాట్ పరిసరాలు, రోడ్డు ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోవటం చూస్తే, ఎన్‌టిఆర్‌ను పార్టీకి దూరం చేయడంలో భాగమనిపిస్తోందన్నారు. నిన్నటి వరకు సిఎం అవడానికే చంద్రబాబు ఆనాడు ఎన్‌టిఆర్‌ను గద్దె దించాడని భావించానని, కానీ ఎన్నికలకు ముందే ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఎన్‌టిఆర్ ఓడించి ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నినట్లు తెలిసిందని ఆరోపణలు చేశారు. 256 సీట్లతో ఎన్‌టిఆర్ ప్రభుత్వం రావటంతో బాబు కంగుతిన్నాడని, ఏదో ఒకలా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్‌కు భారతరత్న రాకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. టిడిపిని మళ్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టే చంద్రబాబు ప్రయత్నాలను ఎన్‌టిఆర్ అభిమానులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మళ్లీ ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఆత్మగౌరవంతో వచ్చిన తెలుగుదేశం పార్టీని, ఆత్మవంచన పార్టీగా మార్చి టిడిపిని అమ్మేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఒక పెద్ద ఆక్టోపస్, పెద్ద రాబందు అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు.

Comments

comments