Home సినిమా అమ్మమ్మను అయిపోయానోచ్!

అమ్మమ్మను అయిపోయానోచ్!

Laxmi-Rai

‘నా ఇద్దరు బిడ్డలకు మరో ఇద్దరు. నా ప్రపంచం మరింత పెద్దదైంది. అమ్మమ్మ కావడం ఎంతో గర్వంగా ఉంది”అని ట్వీట్ చేసింది లక్ష్మీరాయ్.  ఈ ఆనందాన్ని ఆమె తన అభిమానులతో పంచుకుంది. అసలు లక్ష్మీరాయ్ ఏంటి? అమ్మమ్మ కావడమేంటి? అసలు ఆమెకు  పెళ్లే కాలేదు కదా అని అంటారా? నిజమే… కానీ ఆమె మియు, లియు అనే రెండు కుక్క పిల్లలను పెంచుకుంటోంది. వాటిని తన బిడ్డలకంటే ఎక్కువగా చూసుకుంటోంది. అయితే ఆ రెండు కుక్క పిల్లలకు ఇటీవల రెండు పిల్లలు పుట్టాయి. అలా లక్ష్మీరాయ్ అమ్మమ్మ అయిందన్న మాట. వాటికి టిఫాని, పకో అని నామకరణం చేసి అమ్మమ్మ అయిపోయానని తన ఆనందాన్ని తెలియజేసింది లక్ష్మీరాయ్. “నా ఈడు అమ్మాయిలు చాలా మంది ఇప్పటికే తల్లులయ్యారు. కానీ నేనే ఏకంగా అమ్మమ్మనే అయ్యాను”అని అంటూ తన కుక్కపిల్లలతో సరదాగా గడుపుతోంది లక్ష్మీరాయ్.