Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వృద్ధిరేటు పరుగే లక్ష్యం

modi

ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా రెట్టింపు కోసం కృషి
ఢిల్లీలో వాణిజ్య శాఖ భవన శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటన

న్యూఢిల్లీ : భారత వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థి క వ్యవస్థగా చేయడమే తమ ప్రభుత్వలక్షమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే ప్రపంచ వాణిజ్యంలో భార త వాటాను రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన కొత్త కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేపిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని, కరెంటు ఖాతా లోటును, ద్రవ్య లోటును అదుపులో ఉంచగలిగిందని చెప్పారు. 2017 18 ఆర్థిక సంవత్సరాని కి 7.7 శాతం వృద్ధి రేటును సాధించామని ఆయన అంటూ, అయితే 7 8శాతం వృద్ధి రేటును దాటి రెండంకెల వృద్ధి రేటును సాధించడమే ప్రభుత్వ లక్షమని చెప్పారు. భారత్ ఎప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎప్పుడు చేరుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్షమన్నారు. దేశ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల దిగుమతులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ప్రస్తుతం 1.6 శాతంగా ఉన్న భారత్ వాటాను కనీసం 3.4 శాతానికి పెంచడానికి వాణిజ్య మంత్రి త్వ శాఖ కృత నిశ్చయంతో పని చేయాలని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరిస్తూ, పనిని ఆలస్యం చేసే సంస్కృతినుం చి భారత్ దూరంగా సాగిందని, అదే తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమన్నారు. గత జూలై 1నుంచి వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రావడం వల్ల వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడడమే కాక, పన్ను పరిధి విస్తృతం అయిందన్నారు. జిఎస్‌టి కింద కొత్తగా 54లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడవతో పాటుగా విదేశీ ద్రవ్య నిల్వలు రికా ర్డు స్థాయికి పెరిగాయని ప్రధాని చెప్పారు. వాణిజ్య భవన్ నిర్ణీత గడువులోగా పూర్తవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా గేట్ వద ్ద4.33 ఎకరాల స్థలంలో రూ. 226 కోట్ల వ్యయంతో ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని పూర్తిగా పేపర్‌లెస్ కార్యాలయంగా తీర్చిదిద్దనున్నారు.

Comments

comments