Search
Wednesday 14 November 2018
  • :
  • :

నాయకత్వ లక్షణాలిలా ఉండాలి

భవిష్యత్తులో మీరు ఒక బృందానికి ప్రాతినిధ్యం అలాటి తరహా ఉద్యోగం వెతుకుతున్నారా…అలాగైతే మీలో కొన్ని లక్షణాలు ఉండాల్సిందే..కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. మంచి నాయకులు అవ్వాలంటే నాయకత్వలక్షణాలను  ఏవిధంగా మెరుగుపరుచుకోవాలో చూద్దాం..

Leadership
టీంలో పనిచేసే ఉద్యోగుల ప్రతిభను ఎలా గుర్తించాలంటే…వారికిచ్చిన టాస్క్‌ను వాళ్లు సక్రమంగా చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తుండాలి.
బాస్‌కు ఉండాల్సిన మొదటి లక్షణం ముందుగా తన బలం, బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగిఉండటం.
ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి.
టీం సభ్యులను గౌరవించాలి. వాళ్ల బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి.
వారికి ప్రతినిధిగా ఉండాలి.
చిన్న చిన్న గోల్స్, పెద్ద పెద్ద గోల్స్‌ను సెట్ చేస్తుండాలి.
పనుల విషయంలో ఒకే సారి పది పనుల టాస్క్‌లను పెట్టుకోకుండా చేయల్సిన పనిపై శ్రద్ధ పెట్టాలి.
నిర్ణయం తీసుకోవాల్సినపుడు తన నిర్ణయమే చివరిదై ఉండాలి. అప్పుడప్పుడూ టీం సభ్యుల సలహాలు తీసుకోవచ్చు.
సృజనాత్మకతను పెంచుకోవాలని టీం సభ్యులను పోత్సహిస్తూ ఉండాలి. మరీ వారితో కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు.
చేయకూడనివి..
తన టీం సభ్యుల ఎమోషన,్ల దృష్టికోణంతో ఆడుకోవద్దు.
వారితో భావావేశాలను పంచుకోవడం, విభేదాలను పరిష్కరించంలాంటివి పెట్టుకోవద్దు.
ఒకవేళ పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పడితే బృందసభ్యులను నిందించవద్దు.
తప్పు ఎక్కడుందో తెలుసుకోవాలి
బృందంలో సభ్యుల గురించి ఒక నిర్ణయానికి రాకూడదు.

Comments

comments